డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరువురికి జరిమానా
GNTR: తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 12న నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. కూచిపూడి యశ్వంత్, దాసరి బ్రహ్మేశ్వరరావులను బుధవారం కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి వివేక్ వర్ధన్ ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు సీఐ చెప్పారు.