పాక్ ప్రధానికి తీవ్ర అవమానం
పాక్ ప్రధాని షరీఫ్‌కు తీవ్ర అవమానం జరిగింది. తుర్కిమెనిస్తాన్ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో షరిఫ్ భేటీ జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి పాక్ ప్రధాని వచ్చి వేదికపై కూర్చున్నారు. అయితే 40 నిమిషాలు గడిచినా పుతిన్ రాలేదు. దీంతో సహనం కోల్పోయిన షరిఫ్.. వేరే మీటింగ్‌లో ఉన్న పుతిన్ దగ్గరకు డోర్ నెట్టుకుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.