విమానం వెనక భాగంలో చిక్కుకున్న పారాచూట్

విమానం వెనక భాగంలో చిక్కుకున్న పారాచూట్

ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కైడైవ్ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి పారాచూట్ విమానం వెనక భాగంలో చిక్కుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి చాలాసేపు గాల్లోనే వేలాడాడు. దక్షిణ కెయిర్న్స్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, స్కైడైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.