క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తులు ఆహ్వానం

క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బీ. అడ్డయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు.