పూర్వ విద్యార్థుల మెడికల్ క్యాంపు

ELR: ముసునూరులోని రాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయంలో ఈరోజు పూర్వ విద్యార్థులైన వైద్యులచే ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారి మాట్లాడుతూ.. ఇదే పాఠశాలలో చదివి వైద్యులుగా ఎదిగి నేటి బాలికలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం నేటి బాలికలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.