భువనేశ్వరికి పురస్కారాలు.. గర్వకారణం: బాలకృష్ణ
AP: సీఎం చంద్రబాబు సతీమణి, NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లండన్‌లో 2 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్బంగా MLA బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భువనేశ్వరి పురస్కారాలను అందుకోవడం తమ కుటుంబానికి, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఆమె దూరదృష్టి, కృషి, ప్రజల పట్ల ఉన్న సేవాభావానికి లభించిన గౌరవం అని పేర్కొన్నారు.