ఈనెల 14 తేతలిలో హిందూ సమ్మేళనం
W.G: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం ఈనెల 14న తణుకు మండలం తేతలిలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సమితి అధ్యక్షుడు వేగేశ్న గోపాలకృష్ణంరాజు తెలిపారు. నిన్న తేతలిలో సమ్మేళనం కరపత్రాలు ఆవిష్కరించారు. తేతలి శివాలయం వద్ద జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.