చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కేంద్ర నాయకత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం బీజేపీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగానే చేవెళ్లకు ఆయన పేరును ఖరారు చేశారు.