ఆర్ఎంపీ మృతి... నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

ఆర్ఎంపీ మృతి... నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

NLG: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేని గూడెంలో గ్రామీణ వైద్యుడు కన్నెబోయిన కాటమయ్య యాదవ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.