సెల్ సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు

అల్లూరి: సెల్ సిగ్నల్స్ లేక అనంతగిరి మండలంలోని రొంపెల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 13 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. రొంపెల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెల్ సిగ్నల్స్ లేక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఓటీపీ, ఈ-కేవైసీ, ఈ-క్రాప్ తదితర నమోదుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.