రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం
MDCL: ఉప్పల్ పరిధి బీరప్పగడ్డలో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను BRS నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. ARK రెసిడెన్సీ నుంచి వంజరి నర్సింగరావు ఇంటి వరకు, శంకరయ్య దుకాణం వరకు పనులు జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పు 4.5 మీటర్లు తగ్గకుండా చూడాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు.