సీతారాములవారికి ప్రత్యేక పూజలు

సీతారాములవారికి ప్రత్యేక పూజలు

GDWL: అలంపూర్ పట్టణంలోని రాములవారి వీధిలో ఉన్న శ్రీ సీతారాములవారి ఆలయంలో నాయి బ్రాహ్మణ సంఘం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం కార్యదర్శి మధు, వారి కుటుంబ సభ్యులు స్వామివారికి, అమ్మవారికి అభిషేకం, అర్చన చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి శనివారం ఈ పూజలు నిర్వహిస్తామని మధు తెలిపారు.