'ఎంవోయూలు కాదు, అమలు ముఖ్యం'
AP: విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ప్రభుత్వం భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. అయితే, కేవలం ఒప్పందాలు చేసుకుంటే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాలు, పర్యావరణ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అప్పుడే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.