మద్దిలపాలెంలో ఆక్రమణల తొలగింపు
VSP: మద్దిలపాలెం జీవీఎంసీ 22వ వార్డు జాతీయ రహదారిపై కాలువలను అక్ర మించి ఏర్పాటు చేసిన దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది బుధవారం తొలగించారు. గెడ్డపైదుకాణాలు ఏర్పాటు చేసి సిమెంట్ పలకలు అమర్చడంతో మురుగు పారుదల కావడం లేదు. దీంతో వీటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అధికారుల చర్యలతో ఉపాధి కోల్పోయామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.