పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసిన అధికారులు

పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసిన అధికారులు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు యూసుఫ్‌గూడ స్టేడియంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వాహణకు 5 వేల మంది సిబ్బంది హాజరుకానున్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 1,761 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు.