ఘనంగా స్వర్ణరథోత్సవ కార్యక్రమం

ఘనంగా స్వర్ణరథోత్సవ కార్యక్రమం

NDL: శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిన్న స్వర్ణరథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆరుద్రోత్సవం కావడంతో.. ఏకాదశ రుద్రబిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని గంగధర మండపం నుంచి నందిమండపం వరకు రథోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షలు పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు.