సర్పంచ్‌గా చిట్యాల దేవేంద్ర విజయం
SRCL: తంగళ్ళపల్లి మండలం ఇంద్రానగర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చిట్యాల దేవేంద్ర ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దొగ్గల పద్మపై దేవేంద్ర గెలుపొందారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా ఇంద్రానగర్ గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.