రామచంద్రారెడ్డి గెలుపుపై కేటీఆర్ స్పందన

రామచంద్రారెడ్డి గెలుపుపై కేటీఆర్ స్పందన

TG: సూర్యపేట నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. '100 ఏళ్లకు దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రజల ఆదరణ పొందడం అరుదైన విషయం. యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం గొప్ప విషయం. నాగారం గ్రామ ప్రజలకు, మద్దతుగా నిలిచిన BRS శ్రేణులకు అభినందనలు. రామచంద్రారెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించాలి' అని పేర్కొన్నారు.