కలలో చెప్పారని.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
గుజరాత్ నవ్సరీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలలో ఎవరో చెప్పారంటూ తన ఐదు, ఏడేళ్ల వయసు ఉన్న పిల్లలను తల్లి చంపేసింది. అనంతరం మామ మీద కూడా ఎటాక్ చేసింది. మామ కేకలు విన్న స్థానికులు ఆమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య సమయంలో పక్కనే సింహంపై వెళ్తున్న మాత ఫొటో ఉంచుకోవడంతో పాటు.. ఆమె జుట్టు విరబోసుకుని, నుదుట తిలకం పెట్టుకుని ఉన్నట్లు సమాచారం.