కోలగట్ల శ్రావణికి అభినందనలు వెల్లువ

VZM: వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీగా నియమితులైన కోలగట్ల శ్రావణికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. శుక్రవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో గొల్లలపేట గ్రామం నుంచి ప్రెసిడెంట్ రామ్‌నాయుడు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళలు వచ్చి శ్రావణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.