అజిత్ దోవల్‌‌తో రష్యా డిప్యూటీ పీఎం భేటీ

అజిత్ దోవల్‌‌తో రష్యా డిప్యూటీ పీఎం భేటీ

NSA అజిత్ దోవల్‌తో రష్యా తొలి డిప్యూటీ పీఎం డెనిస్ మాంటురోవ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు. గత డిసెంబర్ శిఖరాగ్ర సమావేశ నిర్ణయాల అమలును సమీక్షించిన నేతలు.. రక్షణతో పాటు ఇంధనం, వాణిజ్య రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.