భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

WGL: జిల్లా కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.