తిరుమలలో సుప్రభాతం రద్దు.. ఎందుకంటే?
AP: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేశారు. రేపు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు మొదలవుతుండటంతో.. ఎల్లుండి నుంచి సుప్రభాతం బదులు 'తిరుప్పావై' పాశురాలతో స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ నెల రోజులూ బిల్వ పత్రాలతో అర్చన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉంటుంది.