నిజాయితీ చూపుతున్న ఆటో డ్రైవర్లకు సన్మానం

నిజాయితీ చూపుతున్న ఆటో డ్రైవర్లకు సన్మానం

KNR: ఆటో డ్రైవర్ నిజాయతీని గుర్తించి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గురువారం సన్మానించారు. ఆదివారం కరీంనగర్లో ఓ మహిళ ఆసుపత్రికి వచ్చి, తన ఆటోలో బ్యాగు మరిచిపోయింది. కాగా, ఆ బ్యాగులో 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దానిని చూసిన తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కనకం రాజేందర్ వాటిని తిరిగి ఇచ్చారు. దీంతో సీపీ ఈరోజు ఆయన్ను సన్మానించి, అభినందించారు.