రోడ్డు ప్రమాదంలో వీవోఏ మృతి

రోడ్డు ప్రమాదంలో వీవోఏ మృతి

KRNL: రోడ్డు ప్రమాదంలో వీవోఏ అరుణమ్మ (50) మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. భర్త వెంకటేశ్వరరెడ్డితో కలిసి బైక్‌పై కర్నూలుకు వెళ్తుండగా కె. నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపాడు వద్ద కారు ఢీకొంది. అరుణమ్మ అక్కడికక్కడే మరణించగా, భర్తకు గాయాలయ్యాయి. అరుణమ్మ పొదుపు సంఘంలో పనిచేస్తోంది.