అగ్నికి ఆహుతైన వరి చేను కుప్ప
SKLM: సంతబొమ్మాళి, మలగాం గ్రామానికి చెందిన కౌలు రైతు బొమ్మాళి కృష్ణారావుకు చెందిన వరి చేలు కుప్ప శనివారం రాత్రి దగ్ధమైంది. సుమారు రెండు ఎకరాలలో పండిన పంట తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కల్లాం కుప్ప వేశారు. తుఫాన్ అనంతరం నూర్చుకునేందుకు ఉంచిన సమయంలోనే ఇలా జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదంతా ఈ పంటపైనే కుటుంబం జీవిస్తామని ఇలా నష్టం జరిగిందని వాపోయారు.