రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు డీఎంహెచ్ఓ సన్మానం
GDWL: జిల్లా వైద్యులు, సిబ్బంది రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ సంధ్యా కిరణ్మయి కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బృందాన్ని గురువారం ఆమె సన్మానించారు.