నేడు శేరీలలో జాబ్ మేళా

నేడు శేరీలలో జాబ్ మేళా

మెదక్: వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీసీ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి మనోహరాబాద్ మండలం దూలపల్లి వద్ద ఐటీసీ పరిశ్రమలో ఎలక్ట్రికల్, సోలార్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 79816-76713, 88977-77504 సంప్రదించాలన్నారు.