ముగిసిన రాజకీయ దిగ్గజం కావూరి ప్రస్థానం

ముగిసిన రాజకీయ దిగ్గజం కావూరి ప్రస్థానం

AP: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు(82) చికిత్స పొందుతూ కన్నుమూశారు. 8, 9, 12, 14, 15వ లోక్‌సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందగా, ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ విభజన వరకు కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్న ఆయన, 2014 తర్వాత బీజేపీలో చేరారు.