ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
BHNG: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు హాజరై మాట్లాడారు. ముందుగా ఆయన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అవేజ్ చిస్తి, మున్సిపల్ ఛైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.