గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్న అధికారులు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్న అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని సోమవారం పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి విజయ భాస్కర్ తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన అవీజ్ అనే వ్యక్తిని 150 గ్రాముల గంజాయిని బైక్‌పై గద్వాలలో అమ్మడానికి తీసుకువస్తుండగా చిన్నచింతరేవుల ఎక్స్ రోడ్డు వద్ద పట్టుబడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.