VIDEO: సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు
కోనసీమ: మామిడికుదురు మండలం మాకనపాలెంలో శ్రీ అనంత లక్ష్మీ భూదేవి సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి ఆలయం వద్ద మహిళలు ప్రదర్శించిన కోలాటం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ చీరలు ధరించిన మహిళలు ఆధ్యాత్మిక గీతాలకు పాదాలు కదుపుతూ లయబద్ధంగా నృత్యం చేశారు.