నా వైఖరి నుంచి వెనక్కి తగ్గను: శుభ్‌మన్ గిల్

రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం దీనిపై గిల్ స్పందించాడు. 'నాకు, అంపైర్‌కు మధ్య చాలా డిస్కషన్ జరిగింది. విజయం కోసం 110 శాతం కృషి చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ సహజం. అక్కడ నా ఉద్దేశం ఏంటో చెప్పా. నేను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గను' అని స్పష్టం చేశాడు.