సిలిండర్లు తక్కువ బరువు.. ప్రశ్నించిన అధికారులు
GNTR: స్థానికుల ఫిర్యాదులపై తుళ్లూరులో తూనికలు, కొలతల శాఖ అధికారులు కమ్యూనిటీ హాల్ సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 64 HP గ్యాస్ సిలిండర్లను పరిశీలించగా, 7 సిలిండర్లలో నిర్దేశిత బరువుకంటే తక్కువగా ఉండటం గుర్తించారు. దీనిపై సంబంధిత HP సేల్స్ అధికారిని అధికారులు ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.