రైతులు దళారుల వలలో పడకూడదు: MLA
MHBD: మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బెతోల్ గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. రైతులు పత్తిని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారుల వలలో పడకూడదని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని, తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని మద్దతు ధర ఇస్తున్నామని పేర్కొన్నారు.