VIDEO: రోడ్లు అధ్వానం.. ప్రయాణం నిదానం

NZB: కోటగిరి మండలం పెంట గ్రామం నుండి ఎత్తోండ వైపు వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉందని, వాహనాలు జారి పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.