'చెరువులో నీరు ఖాళీ అవుతున్నాయి.. చర్యలు తీసుకోండి'
CTR: వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో చెరువులో నీటి నిల్వ లేకుండా లోతట్టు ప్రాంతానికి వెళ్లేటట్లు మంచినీటి చెరువును కొందరు తవ్వేశారని స్థానికులు శుక్రవారం ఆరోపించారు. బాధ్యులను గుర్తించి యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇంత జరుగుతున్నా క్షేత్ర స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నట్లో అని ప్రశ్నించారు.