'రైతులు సాగులో సాంకేతికతను ఉపయోగించాలి'

NLG: చండూరు మండలం పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈవో పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్‌తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. పత్తి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులు వివరించారు.