VIDEO: కోనసీమ జిల్లా జేసీ కీలక ప్రకటన
కోనసీమ: లింగ నిర్ధారణ నిషేధాన్ని బలోపేతం చేయడానికి అవగాహన కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరాన్ని జిల్లా జేసీ నిశాంతి నొక్కి చెప్పారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలో PC & PNDT చట్టం, ఏఆర్టీ నియమాలు, సరోగసీ చట్టం అమలుపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ చట్టాలు, నియమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.