APలోని ఆ పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల
భద్రాచలాన్ని ఆనుకొని APలో ఉన్న 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాసిన ఆయన.. 5 పంచాయతీలను ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకులపాడు, కన్నాయిగూడెంగా పేర్కొన్నారు. APలో జిల్లాల పునర్విభజనపై కసరత్తు జరుగుతున్న వేళ మంత్రి తుమ్మల ఇలా కోరడం గమనార్హం.