విద్యార్థులకు స్టెమ్ విద్యను అందించడమే లక్ష్యం

KKD: విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన తొండంగి మండలం బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు STEM విద్యతో కలిగే ప్రయోజనాల గురించి రాబోయే భవిష్యత్తులో దీని ప్రాముఖ్యత గురించి వివరించారు.