'వర్షపు వరద నీరు కాలనీలో నిలవకుండా చూసే బాధ్యత నాది'

WGL: రానున్న వర్షాకాలంలో వరద నీరు కాలనీలో ఎక్కడ నిల్వ ఉండకుండా చూసే బాధ్యత తనదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53వ డివిజన్ విజయనగర్ కాలనీ, విద్యారణ్యపులి కాలనీలో నేడు ఆయన పర్యటించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.