BJP పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్
MBNR: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ముట్టడించారు. తెలంగాణ చౌరస్తా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాచేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేకచర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమేనని ఆరోపించారు.