పోలీస్ స్టేషన్‌ను తనిఖీలు చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీలు చేసిన డీఎస్పీ

భూపాలపల్లి: పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు సూచించారు. చిట్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. సీఐ మల్లేష్, ఎస్సై శ్రావణ్ కుమార్‌తో కలిసి స్టేషన్ పరిసరాలను పర్యవేక్షించారు. రికార్డులను, కేసు నమోదు వివరాలను, పోలీస్ డైరీ, మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు.