'ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు'
KMR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలానికి చెందిన 65 మంది లబ్ధిదారులకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం అందించారు.