అవినీతి ఆరోపణలతో సస్పెండ్.. మళ్లీ పదవి.!
TPT: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా రేణిగుంట మాజీ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డిపై ఈనెల 20న హై కోర్టు సస్పెన్షన్‌ను ఎత్తేసింది. దీంతో ఆయన తిరిగి రేణిగుంటలో పోస్టింగ్ పొందాడు. సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై అప్పీల్‌కు వెళ్లాలి. అందుకు విరుద్ధంగా ఆయన్నే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ నియమించాలంటూ IGనే స్పెషల్ CSకు 24న ఫైలు పంపారు.