రాష్ట్ర స్థాయి 'MUN' పోటీలకు 11 మంది ఎంపిక!
మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి 'మోడల్ యునైటెడ్ నేషన్స్' (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.