'ఆశా వర్కర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'
SKLM: ఆశా వర్కర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే.నాగమణి కోరారు. వీరితో పాటు CITU జిల్లా అధ్యక్షులు సీ.హెచ్.అమ్మన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రణస్థలంలో కోస్టాలో యూనియన్ సమావేశం నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని పీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలిపారు.