జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్

KMR: తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు.