VIDEO: వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: కంభం పట్టణంలోని అర్ధవీడు వెళ్లే మార్గంలో ఎస్సై నరసింహారావు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు, లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. అనంతరం హెల్మెట్ ధారణ, రోడ్డు ప్రమాదాలపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన పేర్కొన్నారు.